Getup Srinu : 24 గంటలు కంటిన్యూ షూట్.. ఆ నొప్పులతో ఆర్టిస్ట్‌గా ఫెయిల్ అయిపోతానేమో అనిపించింది..

రాజు యాదవ్ సినిమా షూటింగ్ లో గెటప్ శ్రీను ఎదుర్కున్న కష్టాల గురించి తెలిపాడు.

Getup Srinu : 24 గంటలు కంటిన్యూ షూట్.. ఆ నొప్పులతో ఆర్టిస్ట్‌గా ఫెయిల్ అయిపోతానేమో అనిపించింది..

Getup Srinu Reveals difficulties while Raju Yadav Movie Shooting

Updated On : May 5, 2024 / 5:29 PM IST

Getup Srinu : బుల్లితెరపై జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. తన కామెడీతో మెప్పించి సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తున్న గెటప్ శ్రీను త్వరలో హీరోగా రాబోతున్నాడు. కృష్ణమాచారి దర్శకత్వంలో గెటప్ శ్రీను, అంకితా ఖారత్ జంటగా ‘రాజు యాదవ్’ అనే సినిమా తెరకెక్కింది. ఫేస్ కి బాల్ తగలడం వల్ల ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా ఫేస్ మారిపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటి అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

రాజు యాదవ్ సినిమా మే 17న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో రాజు యాదవ్ సినిమా షూటింగ్ లో గెటప్ శ్రీను ఎదుర్కున్న కష్టాల గురించి తెలిపాడు.

Also Read : Raju Yadav Trailer : గెటప్ శ్రీను హీరోగా ‘రాజు యాదవ్’ ట్రైలర్ చూశారా? ఫేస్ లో నవ్వు అలాగే ఉండిపోతే..

రాజు యాదవ్ మాట్లాడుతూ.. షూటింగ్ షెడ్యూల్ లో ఒక రోజు ఉదయం 7 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటల వరకు షూట్ చేశాము. మామూలుగానే సినిమా అంతా నవ్వుతూనే పెట్టాలి ఫేస్. ఆ రోజంతా అలాగే పెట్టాను. చివర్లో ఎమోషన్ సీన్ చేయాలి. ఓ పక్క స్మైల్ ఫేస్ పెట్టాలి, మరో పక్క ఎమోషన్ చూపెట్టాలి. అది సరిగ్గా రావట్లేదు. నాకు తెలియకుండా ఏడుపు వచ్చేసింది, నా వల్ల కావట్లేదు అనిపించింది. కానీ డైరెక్టర్ సపోర్ట్ ఇచ్చి చేయించారు. నవ్వుతూ ఎక్కువ సేపు ఉంచితే దవడ దగ్గర ఎముకలు బాగా స్ట్రెస్ తీసుకొని వణుకు వచ్చేది. దాని వల్ల దవడల దగ్గర, మెడ దగ్గర బాగా నొప్పి వచ్చేది. ఆ నొప్పుల వల్ల కళ్ళల్లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయేవి. ఆ నొప్పిని భరిస్తూ, కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాను ఛాలెంజింగ్ గా తీసుకొని. ఆ రోజు మాత్రం నేను భయపడ్డాను ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోతానేమో అని అన్నారు.