Anti-Pak protests: భారత్‌లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను కలిపేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన అక్కడి ప్రజలు

పాకిస్థాన్‌లో ఆర్థిక, ఆహార సంక్షోభం తలెత్తిన వేళ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లద్ధాక్ లో తిరిగి కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పాకిస్థాన్ తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి.

Anti-Pak protests: పాకిస్థాన్‌లో ఆర్థిక, ఆహార సంక్షోభం తలెత్తిన వేళ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బల్తిస్థాన్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లద్ధాక్ లో తిరిగి కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు పాకిస్థాన్ తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి.

తాజాగా, గిల్గిత్ బల్తిస్థాన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని, కార్గిల్ జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. గత 12 రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం తమ పట్ల వివక్షాపూరితంగా పాలసీలు అమలు చేస్తోందని ఆందోళనకారులు అంటున్నారు.

గోధుమలు, ఇతర ఆహార పదార్థాలపై సబ్సిడీలు లేకపోవడం, అక్రమంగా భూ ఆక్రమణలు జరుగుతుండడం వంటి అంశాలను ఆందోళనకారులు లేవనెత్తుతున్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇటీవల గోధుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలకు దిగిన వీడియోలు బయటకు వచ్చాయి.

అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో ఈ వీడియోల ద్వారా తెలిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పాక్ కు అప్పులు ఇవ్వడానికి కూడా పలు దేశాలు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు, పాకిస్థాన్ లో నిత్యావసర సరుకుల దరలూ ఆకాశాన్నంటుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు