TS TET 2024 : టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే?

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ..

TS TET 2024 Application Deadline Extension : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెంచిన గడువు ప్రకారం.. ఈనెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.

Also Read : TS TET 2024 : గుడ్ న్యూస్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా..!

టెట్ కోసం మంగళవారం (9వ తేదీ) వరకు 1.93లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, గతంకంటే ఈ ఏడాది టెట్ కు దరఖాస్తులు తక్కువ రావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే కారణంగా విద్యావేత్తలు పేర్కొంటున్నారు. 2016లో 3.40లక్షలు దరఖాస్తులు వచ్చాయి. 2017లో 3.29లక్షలు, 2022లో 3.79లక్షలు, 2023లో 2.83లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1.93,135 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గడువు పొడిగించినట్లు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు