TS TET 2024 : గుడ్ న్యూస్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా..!

TS TET Exam 2024 Updates : టెట్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు గడువు తేదీని కూడా పొడిగించింది.

TS TET 2024 : గుడ్ న్యూస్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా..!

Telangana Government Releases TET Notification with dsc 2024 Exam Dates

TS TET Exam 2024 Updates : తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం (మార్చి 14న) టెట్‌ నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ మెగా డీఎస్సీ కన్నా ముందుగానే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 27 నుంచే టెట్ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

Read Also :  Singareni Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలు పడ్డాయి.. ఇదిగో నోటిఫికేషన్!

డీఎస్సీ పరీక్ష తేదీలు ప్రకటన :
టెట్ పరీక్ష నిర్వహణపై నిర్ణయంతో ఎక్కువ మందికి డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణా విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. ఇటీవలే 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4 నుంచే ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

జూన్ 6 వరకు దరఖాస్తు పొడిగింపు :
వచ్చే జూలై 27 నుంచి 31వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక టెట్ నిర్వహణ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు గడువును కూడా పొడిగించింది. జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ అభ్యర్థులకు లబ్ది చేకూరనుంది.

Read Also :  TSPSC Group-1 Exam : తెలంగాణలో గ్రూపు-1 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?