RCB : ఆర్‌సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి అద్భుతం జరిగితే తప్పా..!
ఐపీఎల్ 17వ సీజన్ అంచనాలకు అందడం లేదు.
- Thota Vamshi Kumar
- Published On : April 21, 2024 / 01:50 PM IST
Do RCB still have play offs chances
Royal Challengers Bengaluru : ఐపీఎల్ 17వ సీజన్ అంచనాలకు అందడం లేదు. సీజన్‌కు ముందు ఖచ్చితంగా కప్ కొడతాయనుకున్న పెద్ద జట్లు బోల్తా పడుతుండగా ఏ మాత్రం అంచనాలు లేని జట్లు మెరుపులు మెరిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎవ్వరి అంచనాలకు అందని విధంగా ఆడుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన సైతం అంతు చిక్కడం లేదు. ఆడిన ఏడు మ్యాచుల్లో ఆర్‌సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది.
ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆర్‌సీబీ తలపడుతోంది. ఈ మ్యాచులోనైనా గెలిచి వరుస ఓటములకు ఆర్‌సీబీ బ్రేక్ వేస్తుందా? లేదో చూడాల్సిందే.?
ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా?
ఈ సారి కప్పు మనదే అంటూ రావడం నిరాశ పరచడం ఆర్‌సీబీ అలవాటుగా మారిపోయింది. ఈ సీజన్‌లో అప్పుడే సగం మ్యాచులు ఆడేసింది. ఒక్క పంజాబ్ కింగ్స్ పై మాత్రమే గెలిచింది. రెండు పాయింట్లతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆర్‌సీబీ ఫ్లే ఆఫ్స్ చేరుకోవడం దాదాపుగా అసాధ్యం.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఒక్కటే దారుంది. ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచుల్లో విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరతాయి. ఇలా జరిగితే ప్లే ఆఫ్స్ చేరుకోరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కేకేఆర్, హైదరాబాద్, చెన్నై లాంటి జట్లతో ఆర్‌సీబీ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో ఎలా ఆడుతుందనే దానిపైనా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Virat Kohli : కొద్ది గంటల్లో కేకేఆర్‌తో మ్యాచ్.. కోహ్లి బ్యాట్ విరగొట్టిన రింకూ సింగ్..
