Virat Kohli : కొద్ది గంటల్లో కేకేఆర్‌తో మ్యాచ్‌.. కోహ్లి బ్యాట్ విర‌గొట్టిన రింకూ సింగ్‌..

కొద్ది గంట‌ల్లో మ్యాచ్ అనగా విరాట్ కోహ్లి బ్యాట్‌ను రింకూ సింగ్ విర‌గొట్టాడు.

Virat Kohli : కొద్ది గంటల్లో కేకేఆర్‌తో మ్యాచ్‌.. కోహ్లి బ్యాట్ విర‌గొట్టిన రింకూ సింగ్‌..

Rinku Singh breaks Kohli's bat asks for another one ahead of KKR vs RCB

Virat Kohli – Rinku Singh : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. దాదాపుగా అన్ని జ‌ట్లు స‌గం మ్యాచుల‌ను ఆడేశాయి. ఇప్పుడు ప్ర‌తీకార మ్యాచుల‌కు తెర‌లేసింది. సొంత మైదానంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో ఓట‌మిని చ‌వి చూసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం వ‌చ్చింది. ఆదివారం మ‌ధ్యాహ్నాం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కొద్ది గంట‌ల్లో మ్యాచ్ అనగా విరాట్ కోహ్లి బ్యాట్‌ను రింకూ సింగ్ విర‌గొట్టాడు.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా మార్చి 29న బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కేకేఆర్‌, ఆర్‌సీబీ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (59 బంతుల్లో 83నాటౌట్‌) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 182 ప‌రుగులు చేసింది. ఈ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 16.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ అనంత‌రం రింకూ సింగ్‌కు కోహ్లి త‌న బ్యాట్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

IPL 2024 : ఎనిమిదేళ్ల క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొట్టిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్..

ఈ బ్యాట్ ఇటీవ‌ల విరిగిపోయింది. ఆదివారం మ్యాచ్ నేప‌థ్యంలో ప్రాక్టీస్ సంద‌ర్భంగా కోహ్లి, రింకూ సింగ్‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రింకూ సింగ్.. కోహ్లి ఇచ్చిన బ్యాట్ ఎలా విరిగిపోయింది అనే విష‌యాన్ని వివ‌రించాడు. ఐపీఎల్‌లో సిన్న‌ర్ల‌ను ఎదుర్కొనేట‌ప్పుడు బ్యాట్ విరిగిపోయిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ త‌రువాత కోహ్లి వ‌ద్ద ఉన్న రెండు బ్యాట్‌ల‌ను చెక్ చేస్తూ త‌న‌కు ఓ బ్యాట్ ను ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇందుకు కోహ్లి ఫ‌న్నీ స‌మాధానం చెప్పాడు. నీకు మ్యాచ్‌కు రెండు బ్యాట్లు ఇస్తే.. మెగాటోర్నీలో నువ్వే ఇబ్బంది ప‌డావు అని అన్నాడు.

Gautam Gambhirm : గంభీర్ మీ న‌వ్వు బాగుంది.. నా భార్య కూడా ఎప్పుడూ ఇలా చెప్ప‌లేదురా అయ్యా..

ఇందుకు సంబంధించిన వీడియోను కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కేకేఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు బెంగ‌ళూరు ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓడిపోయి అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో గెల‌వాల్సిందే.