IPL 2024 : ఎనిమిదేళ్ల క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొట్టిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్..

ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట నమోదైంది. ఈ సీజన్ లో ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ పై 19 బంతుల్లో యాబై పరుగులు పూర్తి చేశాడు.

IPL 2024 : ఎనిమిదేళ్ల క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు కొట్టిన జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్..

Jake Fraser-McGurk

IPL 2024 DC vs SRH: ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ జట్టు 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి హైదరాబాద్ జట్టు 266 భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. కేవలం 19.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది.

Also Read : IPL 2024 : వరుసగా నాల్గోసారి అదరగొట్టిన హైదరాబాద్.. 67 పరుగులతో ఢిల్లీపై ఘనవిజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ముఖ్యంగా క్రిస్ మోరిస్ ఎనిమిదేళ్ల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ బద్దలు కొట్టాడు. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ మొత్తం 18 బంతులు ఆడి 65 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి. అయితే, అతను కేవలం 15 బంతులకే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తక్కువ బంతుల్లో యాబై పరుగులు చేసిన ఘనతను సాధించాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున క్రిస్ మోరిస్ 17బంతుల్లో ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ రికార్డును జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ.

Also Read : LSG vs CSK : క్యాచ్ వ‌దిలేసి మంచి ప‌ని చేశావ్‌.. ఈ అవార్డు నీకే.. దీప‌క్ హుడాకు జాంటీ రోడ్స్ అభినంద‌న‌లు

ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట నమోదైంది. ఈ సీజన్ లో ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ పై 19 బంతుల్లో యాబై పరుగులు పూర్తి చేశాడు. సన్ రైజర్స్ జట్టు బ్యాటర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు 16 బంతుల్లో యాబై పరుగులు పూర్తి చేశారు.