LSG vs CSK : క్యాచ్ వ‌దిలేసి మంచి ప‌ని చేశావ్‌.. ఈ అవార్డు నీకే.. దీప‌క్ హుడాకు జాంటీ రోడ్స్ అభినంద‌న‌లు

క్రికెట్‌లో సాధార‌ణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది.

LSG vs CSK : క్యాచ్ వ‌దిలేసి మంచి ప‌ని చేశావ్‌.. ఈ అవార్డు నీకే.. దీప‌క్ హుడాకు జాంటీ రోడ్స్ అభినంద‌న‌లు

Jonty Rhodes thanks Deepak Hooda for dropping catch

Lucknow Super Giants vs Chennai Super Kings : క్రికెట్‌లో సాధార‌ణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది. క్యాచులు ప‌డితేనే మ్యాచులు గెల‌వ‌గ‌లం అని దీని అర్థం. ఎవ‌రైనా ఫీల‌ర్డ్ క్యాచ్ మిస్ చేస్తే మ్యాచ్ అనంత‌రం కోచ్ ఏం చేస్తాడు? స‌ద‌రు ఆట‌గాడిని మంద‌లిస్తాడు, మ‌రోసారి ఇలాంటి త‌ప్పిదాలు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తాడు. అయితే.. ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు జాంటీ రోడ్స్ స్టైలే వేరు. క్యాచ్‌ను మిస్ చేసినందుకు ఆట‌గాడిని మంద‌లించ‌క‌పోగా స‌ద‌రు ఆట‌గాడికి అవార్డు సైతం ఇచ్చాడు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ల‌క్నో ఆడే ప్ర‌తి ఐపీఎల్ మ్యాచ్ త‌రువాత ఉత్త‌మ ఫీల్డ‌ర్‌కు ‘మ్యాజిక్ మైక్’ అవార్డును అంద‌జేస్తాడు. ఇక చెన్నైతో మ్యాచ్‌లో ల‌క్నో 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ అనంత‌రం కూడా బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డును ప్ర‌ధానం చేశాడు. అయితే.. ఈ సారి క్యాచ్‌ను విడిచిపెట్టినందుకు దీప‌క్ హుడాకు అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం.

Team India : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు టీమ్ఇండియా ఎంపిక ఎప్పుడంటే?

ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో ర‌వీంద్ర జ‌డేజా లాంగాన్ మీదుగా షాట్ ఆడాడు. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న దీప‌క్ హుడా బంతిని త‌ప్పుగా అంచ‌నా వేశాడు. దీంతో బంతి సిక్స‌ర్‌గా వెళ్లింది. లేదంటే ఈజీ క్యాచ్ అయ్యుండేది. అయితే.. మ్యాచ్ అనంత‌రం ల‌క్నో పోస్ట్ చేసిన వీడియోలో దీప‌క్ హుడాకు అవార్డు ఎందుకు ఇచ్చారో అన్న విష‌యాన్ని రోడ్స్ వెల్ల‌డించాడు. దీప‌క్ క్యాచ్ మిస్ చేయ‌డం వ‌ల్ల ధోని ఆల‌స్యంగా బ్యాటింగ్ వ‌చ్చాడు. అత‌డు ముందుగానే వ‌చ్చిన‌ట్ల‌యితే మ‌రికొన్ని బంతుల‌ను అత‌డు ఎక్కువ‌గా ఆడేవాడు. అప్పుడు స్కోరు మ‌రింత పెరిగేది అంటూ చెప్పుకొచ్చాడు.

జాంటీ ఈ విష‌యం చెప్ప‌గానే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం న‌వ్వుల‌తో మునిగిపోయింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ధోని 9 బంతుల్లో 28 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

KL Rahul : ధోని చూస్తుండ‌గానే అత‌డి రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన కేఎల్ రాహుల్‌..

ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 176 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (57నాటౌట్‌), ర‌హానే (36), మోయిన్ (30), ధోని (28నాటౌట్‌) రాణించారు. ల‌క్ష్యాన్ని ల‌క్నో 19 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (82), క్వింట‌న్ డికాక్ (54) లు హాఫ్ సెంచ‌రీల‌తో బాదారు.