Team India : టీ20 ప్రపంచకప్‌కు టీమ్ఇండియా ఎంపిక ఎప్పుడంటే?
టీమ్ఇండియా తరుపున టీ20 ప్రపంచకప్ ఎవరెవరు ఆడనున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

BCCI selectors to meet on April 27 or 28 to pick India squad for T20 World Cup
Team India – T20 World Cup 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సీనియర్లతో పాటు జూనియర్లు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీ అనంతరం టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తరుపున టీ20 ప్రపంచకప్ ఎవరెవరు ఆడనున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. మే 1 లోగా ప్రాబబుల్స్ లిస్ట్‌ను ఐసీసీకి అందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 27న లేదా 28 తేదీన ఢిల్లీలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ల మధ్య టీ20 జట్టు ఎంపిక పై సమావేశం జరగనుందని దైనిక్ జాగరన్ తెలిపింది. 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఎలాగూ రోహిత్ శర్మ ఆ రోజున ఢిల్లీలో ఉంటాడు కాబట్టి అదే రోజు సెలక్టర్ అగార్కర్‌ను కలవనున్నారని కథనంలో పేర్కొంది.
KL Rahul : ధోని చూస్తుండగానే అతడి రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..
స్పెయిన్‌లో ఉన్న అగార్కర్..
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నాడు. స్పెయిన్‌లో ఉన్న అతడు ఏప్రిల్ 27 న ఇండియాకు రావొచ్చునని అంటున్నారు. టీ20 జట్టు ఎంపిక పై కెప్టెన్ రోహిత్ శర్మతో ఈనెల 27న లేదా 28న చర్చించనున్నారని, అదే రోజున జట్టును ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
15 మందికి ఛాన్స్..!
టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఇందులో దాదాపు తొమ్మిది నుంచి పది మంది ఆటగాళ్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Uppal : 25న ఉప్పల్‌లో జరిగే ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం..
అయితే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఐపీఎల్‌లో అతడు రాణించేదాన్ని బట్టి అతడి ఎంపిక ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్‌లో రాణిస్తేనే ప్రపంచకప్ జట్టులో చోటు ఉంటుందనే స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే హార్దిక్ అందినట్లు తెలుస్తోంది.