IPL 2024 : వరుసగా నాల్గోసారి అదరగొట్టిన హైదరాబాద్.. 67 పరుగులతో ఢిల్లీపై ఘనవిజయం

హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (89/32)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడి ఓడింది.

IPL 2024 : వరుసగా నాల్గోసారి అదరగొట్టిన హైదరాబాద్.. 67 పరుగులతో ఢిల్లీపై ఘనవిజయం

IPL 2024 _ SRH wins by 67 runs against Delhi Capitals

IPL 2024 SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా నాల్గో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టు భారీ స్కోరుతో దుమ్మురేపింది.

హాఫ్ సెంచరీలతో మెరిసిన ట్రావిస్ హెడ్, షాబాజ్ :
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (89; 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సు) హాఫ్ సెంచరీతో పరుగుల వరద పారించాడు. షాబాజ్ అహ్మద్ (59; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్)తో హాఫ్ సెంచరీతో మెరిశాడు. అభిషేక్ శర్మ (46), నితీష్ కుమార్ రెడ్డి (37) పరుగులతో రాణించగా, అబ్దుల్ సమద్ (13), పాట్ కమిన్స్ (1), ఐడెన్ మార్క్రామ్ (1) పరుగుకే చేతులేత్తేశారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 భారీ స్కోరు చేసింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు ఢిల్లీకి 267 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు. హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (89/32)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఫ్రేజర్, పంత్ విజృంభణ :
అయితే, ఈ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడి ఓడింది. ఢిల్లీ బ్యాటర్లలో జేక్ ప్రేజర్ మెక్‌గుర్క్ (65; 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్)తో హాఫ్ సెంచరీతో విజృంభించాడు. రిషబ్ పంత్ (44; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ పోరెల్ (42; 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించగా.. ఓపెనర్ పృథ్వీ షా (16), ట్రిస్టన్ స్టబ్స్ (10), లలిత్ యాదవ్ (7), అక్షర్ పటేల్ (6), డేవిడ్ వార్నర్ (1) పరుగులకే పరిమితమై ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు.

ఢిల్లీ 19.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో టి. నటరాజన్ 4 వికెట్లు తీసుకోగా, మయాంక్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి తలో రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 2లో హైదరాబాద్ :
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో 2 స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడి 6 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్ హైదరాబాద్