Mohammad Rizwan : కోహ్లి ఐపీఎల్‌లో బిజీ.. ఇదే అదునుగా విరాట్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ప‌నిలో పాక్ ఆట‌గాళ్లు..

పాకిస్తాన్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మద్ రిజ్వాన్ చ‌రిత్ర సృష్టించాడు.

Mohammad Rizwan : కోహ్లి ఐపీఎల్‌లో బిజీ.. ఇదే అదునుగా విరాట్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ప‌నిలో పాక్ ఆట‌గాళ్లు..

Mohammad Rizwan breaks T2OI record of Virat Kohli

Mohammad Rizwan – Virat Kohli : పాకిస్తాన్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మద్ రిజ్వాన్ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. రావ‌ల్పిండి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ క్ర‌మంలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంల‌ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

అంత‌ర్జాతీయ టీ20 మ్యాచుల్లో 3వేల ప‌రుగుల మైలురాయిని చేరుకునేందుకు కోహ్లి, బాబ‌ర్‌ల‌కు చెరో 81 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. రిజ్వాన్ కేవ‌లం 79 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.

Rajinikanth : సూప‌ర్ స్టార్ రజినీకాంత్ కోరిక తీర్చిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..! త‌లైవా ఫుల్ హ్యాపీ..!

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3వేల ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు..

మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (పాకిస్తాన్‌) – 79 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లి (భార‌త్‌) – 81 ఇన్నింగ్స్‌లు
బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 81 ఇన్నింగ్స్‌లు
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 98 ఇన్నింగ్స్‌లు
మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) – 101 ఇన్నింగ్స్‌లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 18.1 ఓవ‌ర్ల‌లో 98 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ 12.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (45నాటౌట్; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.

Virat Kohli : కొద్ది గంటల్లో కేకేఆర్‌తో మ్యాచ్‌.. కోహ్లి బ్యాట్ విర‌గొట్టిన రింకూ సింగ్‌..

మ‌రోవైపు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. అత‌డు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు వ‌రుస‌గా మ్యాచులు ఓడిపోతున్నప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా కోహ్లి రాణిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 361 ప‌రుగులతో టాప్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు.