HCA Polls: HCA అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు.. ఒక్క ఓటుతో గెలుపు

రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది.

Hyderabad Cricket Association election 2023 updates in telugu

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అర్శ‌న‌ప‌ల్లి జగన్మోహనరావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమరనాథ్ పై ఒక్క ఓటుతో గెలిచారు. జగన్మోహనరావు విజయం సాధిచడంతో ఉప్పల్ స్టేడియం దగ్గర మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఆరుగురి సభ్యులతో కొత్త HCA ప్యానెల్ ఎన్నిక జరిగింది. పీఎల్ శ్రీనివాస్ ప్యానెల్ కు కొత్త కమిటీలో చోటు దక్కలేదు. క్రికెట్ ఫస్ట్, గుడ్ గవర్నెన్స్, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానల్ల నుంచి ఇద్దరేసి చొప్పున కొత్త కమిటీకి ఎన్నికయ్యారు.

వైస్ ప్రెసిడెంట్ గా దల్జిత్ సింగ్
గుడ్ గవర్నెన్స్ ప్యానల్ కు దల్జిత్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఆయనకు 63 ఓట్లు వచ్చాయి.

సెక్రటరీగా దేవరాజ్ గెలుపు
క్రికెట్ ఫస్ట్ ప్యానల్ కు చెందిన దేవరాజ్ సెక్రటరీగా గెలిచారు. ఇదే ప్యానల్ నుంచి కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ విజయం సాధించారు. శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ కలిసి క్రికెట్ ఫస్ట్ ప్యానల్ గా ఏర్పడ్డారు.

జాయింట్ సెక్రటరీ గా గెలిచిన బసవరాజు
గుడ్ గవర్నెన్స్ ప్యానల్ కు చెందిన బసవరాజు జాయింట్ సెక్రటరీ గా గెలిచారు. రెండు ఓట్ల తేడాతో ఆయన విజయం దక్కించుకున్నారు.

ట్రెజరర్ గా శ్రీనివాస్ విజయం
HCA ఎన్నికల్లో ట్రెజరర్ గా యునైటెడ్ మెంబెర్స్ ఆఫ్ HCA ప్యానల్ అభ్యర్థి CJ శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయనకు 62 ఓట్లు వచ్చాయి.

కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ గెలుపు
అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ మద్దతు ఇచ్చిన క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ కి చెందిన సునీల్ అగర్వాల్  HCA ఎన్నికల్లో కౌన్సిలర్ గా 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 59 ఓట్లు వచ్చాయి.

ఓటు వేసిన సజ్జనార్, రొనాల్డ్ రాస్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 120 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, వెంకటపతి రాజు, ప్రజ్ఞాన్ ఓజా, పలువురు క్లబ్ నెంబర్స్ ఓటు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

రసవత్తరంగా ఎన్నికలు
HCA Polls 2023: రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. వేంకటపతి రాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న HCA ఎన్నికలు
రాజకీయ రంగు పులుముకోవడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల మధ్య ప్రధాన పోటీ ఉంది. తమకు బీఆర్ఎస్ మద్దతు ఉందని యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ HCA ప్యానెల్ పేరుతో పోటీ చేస్తున్న అర్శ‌న‌ప‌ల్లి జగన్మోహనరావు చెబుతున్నారు. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో పోటీలో ఉన్న అనిల్ కుమార్ ప్యానల్ కు బీజేపీ నేత, HCA మాజీ అధ్యక్షుడు వివేక్ మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఓటు హక్కు ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్స్
నరసింహరావు
శివలల్ యాదవ్
వేంకటపతి రాజు
VVS లక్ష్మణ్
నోయల్ డేవిడ్
సుదీప్ త్యాగి
ప్రజ్ఞాన్ ఓజా

విమెన్ క్రికెటర్స్
సాండ్రా బ్రాంజా
రజిని వేణుగోపాల్
పూర్ణిమా రాజు
డయానా డేవిడ్
స్రవంతి నాయుడు
మిథాలీ రాజ్
మమత కనోజియా
సునీతా ఆనంద్

ట్రెండింగ్ వార్తలు