AP Black Fungus : ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు : అనిల్ సింఘాల్

ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని..

103 Black Fungus Deaths in AP : ఏపీలో బ్లాక్ ఫంగస్ వల్ల 103 మరణాలు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 1623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు, టాబ్లెట్లని కేంద్రమే సరఫరా చేస్తోందన్నారు. ఏపీలో 20 ఏళ్ల లోపున్న వారు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపారు. మూడో దశలో 20 ఏళ్ల లోపున్న వారికి రెండింతల కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

చిన్నారులకు కరోనా సోకితే ఎలాంటి చికిత్స అందించాలని.. మందుల వినియోగం, మాస్కుల లభ్యత వంటి వాటిపై ఫోకస్ పెట్టామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా మూడో దశ కరోనాలో చిన్నారులకు చికిత్స అందించే అంశంపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. చిన్న పిల్లలు పాజిటీవ్ అయితే తల్లులు కూడా ఉండాల్సి వస్తుందన్నారు. అలాంటి వారికి 45 ఏళ్ల వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.  ఏపీలో వైజాగ్ 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.

డీపీఆర్ సిద్దంగా ఉందని, వెంటనే పనులు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. విజయవాడ, తిరుపతిల్లో కూడా పిడీయాట్రిక్ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్టు అనిల్ సింఘాల్ చెప్పారు. పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులను కూడా మూడో దశ కరోనా చికిత్స కోసం సన్నద్ధం చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు పిడీయాట్రీషీయన్సుని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా హోం ఐసొలేషన్ 90 వేల మంది పేషంట్లు ఉన్నారని, హోం ఐసొలేషన్ లో ఉన్న పేషంట్లకు 104 కాల్ సెంటర్ల నుండి లో అవుట్ మొత్తం 511018 అవుట్ గోయింగ్ కాల్స్ చేసి వైద్య సలహాలు అందించారు.

ఈ నెల 10వ తేది వరకు కర్ఫ్యూ గతంలో విధించామన్నారు. దానిని టైమింగ్ మార్చి 20వ తేది వరకు పెంచడం జరిగిందని చెప్పారు. జూన్ 11 నుండి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ వరకు సడలింపు వుంటుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో పాజిటివిటీ తగ్గుతోందని, థర్డ్ వేవ్ పిడియాట్రిక్ కేసులు వస్తే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు.

కొవిడ్ రివ్యూలలో కమిటీ నివేదికను సిఎం జగన్‌కు అందించారు. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏజ్ గ్రూప్ వారిగా డేటాను నివేదికలో ఇచ్చారు. ఎంత మందికి థర్డ్ వేవ్ లో కోవిడ్ వచ్చింది. ఎలాంటి సామర్థ్యం మనకు ఉండాలో సీఎం జగన్ సమీక్షలో చర్చించారు. ఎన్ని బెడ్స్, మందులు, మాస్క్ లు చిన్న పిల్లలకు ఉండాలన్న అంశంపై సిఎం జగన్ సమీక్ష చేశారు.

ట్రెండింగ్ వార్తలు