Ap Poll Violence : ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన హింసపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. హింసాత్మక ఘటనలకు బాధ్యులన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు విన్నపం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మేరుగ నాగార్జున, మోపిదేవి వెంకటరమణ, పేర్నినాని గవర్నర్ ను కలిశారు.
ప్రతి హింసకు పాల్పొడొద్దని జగన్ చెప్పారు- పేర్నినాని
పోలింగ్ రోజు, తర్వాత టీడీపీ వాళ్లు హింసకు పాల్పడ్డారు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో విధ్వంసం సృష్టించాయి. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీని వల్లకాడు చేయాలనుకుంటున్నారా? పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఎన్నికలు జరిపారు. కొంతమంది పోలీసు అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల పరిశీలకుడిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను పెట్టారు. దీపక్ మిశ్రా తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టీడీపీకీ అనుకూలమైన అధికారులను దీపక్ మిశ్రా కలిశారు.
అధికారి విష్ణువర్ధన్ ఇంటికి అర్ధరాత్రి దీపక్ మిశ్రా ఎందుకు వెళ్లారు? దీపక్ మిశ్రా కాల్ డేటాను బయటకు తీయాలి. దీపక్ మిశ్రాను ఇక్కడి నుంచి పంపించాలి. ఆయన స్థానంలో సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రతిహింసకు పాల్పడొద్దని నేతలకు జగన్ ఫోన్ చేసి చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమే హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకుందామని జగన్ చెప్పారు. సంయమనం పాటించాలని క్యాడర్ కు సూచించారు.
Also Read : మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది : సీఎం జగన్