కౌంటింగ్ డే రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి- ఏపీ సీఎస్, డీజీపీలకు ఈసీ ఆదేశం

పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.

Ap Violence : కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది. దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై ఈసీకి వివరాలు అందజేశారు సీఎస్, డీజీపీలు. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంది. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత పటిష్టం చేయాలంది. కౌంటింగ్ డే రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈసీతో భేటీ తర్వాత ఏపీ సీఎస్, డీజీపీలు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరారు.

కాగా.. పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది. రాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట హింస చెలరేగింది. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెబుతున్నారు. తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో టీడీపీ నాయకులు ఈ దాడులకు పాల్పడ్డారని అంటున్నారు.

Also Read : మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది : సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు