మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది : సీఎం జగన్

మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. దేశం మొత్తం ఏపీ ఫలితాలను చూసి షాక్ అవబోతోంది. ప్రశాంత్ కిశోర్ ఊహించనంత స్థాయిలో సీట్లు రాబోతున్నాయని జగన్ అన్నారు.

AP CM YS Jagan

CM Jagan Visit ipac Office : ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. జూన్4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐప్యాక్ కార్యాలయంకు జగన్ వెళ్లారు. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఐప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని అన్నారు. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. దేశం మొత్తం ఏపీ ఫలితాలను చూసి షాక్ అవబోతోంది. ప్రశాంత్ కిశోర్ ఊహించనంత స్థాయిలో సీట్లు రాబోతున్నాయని జగన్ అన్నారు.

Also Read : పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు

ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీలేదు, అంతా టీమే చేస్తుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఈసారికూడా అదే స్థాయిలో గెలవబోతున్నాం. ఐప్యాక్ టీంతో రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే సాగుతుందని జగన్ పేర్కొన్నారు. అనంతరం ఐప్యాక్ ప్రతినిధులు, సిబ్బందితో సీఎం జగన్ మోహన్ రెడ్డి సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు