AP Govt : చేనేత కార్మికులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచే మీకు..
AP Govt : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
handloom workers (File Image)
- ఏపీలోని చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
- ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం కీలక ప్రకటన
- 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్
AP Govt : ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Also Read : AP Budget 2026 : నారా లోకేశ్‌కు కొత్త బిరుదు.. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో ప్రకటన..
చేనేత, పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం గతేడాది చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం తెలిపారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక, విధివిధానాల తయారీ ప్రక్రియ ప్రారంభించారు. తాజాగా.. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీని వల్ల లక్షకుపైగా కుటుంబాలు లాభపడతాయి. హ్యాండ్లూమ్స్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వలన నెలకు రూ.720 ఆదా అవుతుందని, అలాగే పవర్ లూమ్స్ కార్మికులకు నెలకు రూ.1800 వరకు ఆదాయ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 93వేల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మర మగ్గాలు ఉన్న కుటుంబాలు 10,534 వరకూ ఉన్నారు. మొత్తంగా లక్ష3వేల534 కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం అమలుతో లబ్ధి పొందనున్నాయి. ఈ కుటుంబాల్లోని సుమారు 4లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
