Konathala Ramakrishna: కొణతాల రామకృష్ణ అమాత్య ఆశలు నెరవేరేనా? మంత్రి పదవి కోసమే టోన్ మార్చేశారా?
ఒకప్పుడు విశాఖ జిల్లాలో సింగిల్ హ్యాండ్ గణేష్లాగా హవా నడిపించిన కొణతాల..ఇప్పుడు అందరిలానే ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం అయ్యో..అంత పెద్ద నాయకుడు ఇలా ఉండిపోయారేంటన్న చర్చ కూడా నడుస్తుంది.
Konathala Ramakrishna Representative Image (Image Credit To Original Source)
- ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్
- ఒకప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు
- రెబల్ స్టార్ గా గుర్తింపు
- చంద్రబాబు ఫ్యామిలీపై పొగడ్తల వర్షం
Konathala Ramakrishna: సీనియర్ మోస్ట్ లీడర్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరున్న నేత.. గతంలో ఓసారి మంత్రి అయ్యారు. గత రెండేళ్లుగా అమాత్య యోగంపై తెగ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన అంచనాలు తలకిందులు అవుతూ వస్తున్నాయి. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఆ పొలిటీషియన్ తన స్టైల్‌ను మార్చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు రెబల్‌గా ముందుకు నడిచిన ఆయన.. ఇప్పుడు పంథా మార్చుకున్నారా? సీఎం చంద్రబాబు ఫ్యామిలీపై పొగడ్తలు.. ప్రశంసలు అందుకేనా? ఇంతకు ఎవరాయన? ఆ నేత రాజకీయ శైలి ఎందుకు మారినట్లు?
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడున్న పొలిటీషియన్లందరి కంటే ఆయన చాలా సీనియర్. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. 1989లోనే ఫస్ట్ టైమ్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అదే సీటు నుంచి మరోసారి ఎంపీ అయ్యారు. ఇక 2004లో ఎమ్మెల్యే అయి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఐదేళ్లు తన హవా నడిపించారు కొణతాల. ఇక 2009లో ఓడిపోవడంతో ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఎత్తు పల్లాలు చూడాల్సి వచ్చింది. అప్పుడు గనుక కొణతాల గెలిచి ఉండి ఉంటే రాజకీయం వేరేగా ఉండేదని చెప్తుంటారు.
2009లో ఓటమితో పదిహేనేళ్ల పాటు పొలిటికల్‌గా ఇబ్బందులు..
2009లో ఓటమితో పదిహేనేళ్ల పాటు పొలిటికల్‌గా చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు కొణతాల. అయితేనేం 2024లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచి మరీ కొణతాలకు సీటు ఇచ్చారు. అలా ఆయనకు తిరిగి ఎమ్మెల్యేగా చాన్స్ దక్కింది. అయితే ఒకప్పుడు విశాఖ జిల్లాలో సింగిల్ హ్యాండ్ గణేష్లాగా హవా నడిపించిన కొణతాల..ఇప్పుడు అందరిలానే ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. కానీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం అయ్యో..అంత పెద్ద నాయకుడు ఇలా ఉండిపోయారేంటన్న చర్చ కూడా నడుస్తుంది.
ఆ సామాజికవర్గానికి 25ఏళ్ల క్రితం చివరి సారిగా మంత్రి యోగం..
అయితే ఇప్పుడు జనసేనలో సీనియర్ మోస్ట్ లీడర్లలో అనకాపల్లి జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ ఒకరు. ఈ క్రమంలో విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌పై పూర్తి అవగాహన ఉన్న కొణతాలకు మంత్రి పదవి దక్కుతుందని అంతా ఊహించారు. పైగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిగా ఉన్నారాయన. ఆ సామాజికవర్గానికి 25 ఏళ్ల క్రితం చివరి సారిగా మంత్రి యోగం దక్కింది. మళ్లీ ఇంతవరకూ ఆ ఛాన్స్ రానే లేదు. దాంతో విశాఖలో అనేక నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చూపించగల గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ అది ఎందుకో కుదరలేదు.
ఫ్యూచర్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొణతాలకు మంత్రి పదవి?
ఇక ఈ ఏడాది మధ్యలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దాంతో అనకాపల్లి జిల్లా నుంచి కొణతాల రామకృష్ణకు జనసేన కోటాలో మంత్రి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం జనసేనలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీకి మరో మంత్రిపదవి దక్కితే అది నాగబాబుకు ఇస్తారనే చర్చ ఉండేది. అయితే ఒకే కులానికి ..ఒకే కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చారన్న విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుందని జనసేన అధినాయకత్వమే..నాగబాబును మంత్రి చేయాలనుకున్న డెసిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు చెబుతుంటారు. దీంతో బీసీల నుంచి కీలక నేతకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన జనసేనలో ఉందని అంటున్నారు. పైగా గోదావరి జిల్లాల తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలలో జనసేనకు మంచి బలం ఉంది. ఆరు ఎమ్మెల్యే సీట్లను ఇక్కడ ఆ పార్టీ గెలుచుకుంది. ఫ్యూచర్ పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొణతాలకు మంత్రి పదవి ఇవ్వొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి రేసులో కొణతాల ఉన్నారని చర్చ జరుగుతున్న వేళ..బడ్జెట్ సమావేశాలలో ఆయన ఏకంగా సీఎం చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని పొగిడేశారు. చంద్రబాబు, లోకేశ్‌ను మాత్రమే కాదు భువనేశ్వరి, బ్రాహ్మణి, ఆఖరికి దేవాంశ్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు కొణతాల. ఒకే కుటుంబంలో అందరూ ప్రతిభావంతులే అని కొణతాల చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఆ కుటుంబంలోని వారంతా వివిధ రంగాల్లో సత్తా చాటి అవార్డులు అందుకున్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరదీశారు. అయితే ఉన్నట్లుండి ఆయన చంద్రబాబు కుటుంబాన్ని మొత్తం పొగిడేయడం హాట్ టాపిక్ అవుతోంది. పైగా జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీ వారి కంటే ఎక్కువగా బాబు కుటుంబాన్ని కొణతాల పొగడటం వెనక మంత్రి పదవి కోరికలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.
కొణతాలకు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పవన్ నిర్ణయమని..కొణతాల చంద్రబాబును పొగిడింది మంత్రి అందుకోసమేనన్న ప్రచారం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా తన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ లో ఎప్పుడూ రెబల్ స్టార్‌గా ఉన్న కొణతాల..గతంలో ఎప్పుడూ ఇంతలా ఎవరినీ పొగడలేదన్న చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది.
Also Read: మారకపోతే మీకే నష్టం, సీల్డ్ కవర్లో నివేదిక- ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
