పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు

ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.

పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు

Ambati Rambabu

Ambati Rambabu : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేరాయి. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నాటినుంచి ఏపీలో వైసీపీ, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగింది. పోలింగ్ రోజు ఘర్షణలుసైతం చోటు చేసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు చేసుకున్నారు. దీంతో పోలింగ్ రోజు ఏపీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకిదిగి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో.. చెదురుమదురు ఘటనలు మినహా అర్థరాత్రి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవటంతో రాష్ట్రంలో 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం.

Also Read : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్‌షాక్‌.. అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్

పోలింగ్ రోజున పలు పోలింగ్ కేంద్రాల్లో పెద్దెత్తున ఘర్షణలు చోటు చేసుకోగా.. పోలింగ్ తరువాత రోజుకూడా కొట్లాటలు ఆగలేదు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేశారని, ఏపీ పోలీసులుసైతం వారికే సహకారం అందించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకిసైతం  వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. పోలింగ్ రోజున కూటమిలో నాల్గో పార్టనర్ గా ఏపీ పోలీసులు చేరారు.. కూటమి విజయం కోసం వారు కృషి చేశారు. అయినా జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతున్నారని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలంతా జగన్ వెంటనే ఉన్నారని చెప్పారు.