ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సిట్ ఏర్పాటుకు ఆదేశం, ఆ జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.

Poll Violence : ఏపీలో పోలింగ్ రోజు తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలను చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏపీ సీఎస్, డీజీపీ వివరణ అనంతరం పలు చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు 3 జిల్లాల్లో 12 మంది కింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది.

అంతేకాదు శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది. ఏపీలో హింసపై ప్రతీ కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న సీఈసీ.. ఎఫ్ఐఆర్ లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. దాంతో పాటే.. హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది సీఈసీ. ఏపీలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలంది. హింసాత్మక ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎస్, డీజీపీలను ఆదేశించింది సీఈసీ.

సీఈసీ కీలక ఆదేశాలు..
* ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి
* ఏపీలో ఎన్నికల హింసపై నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలి.
* సిట్ ఏర్పాటు చేసి విచారించాలి.
* FIRలు నమోదు చేసి IPC, ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టాలి.
* మొత్తం వ్యవహారంపై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలి.
* రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలంటూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ.
* హింసపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్, డీజీపీకి సూచన.
* ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన అదనపు సెక్షన్లను జతపరచాలి.
* కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి.
* ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.

Also Read : మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది : సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు