Devineni Uma : మా ప్రభుత్వం వచ్చాక.. జైలుకెళ్లడం ఖాయం- దేవినేని ఉమ వార్నింగ్

Devineni Uma : అరేయ్ సన్నాసి.. కట్టిన వాడిని బిల్డర్ అంటారు రంగులు వేసిన వాడిని పెయింటర్ అంటారు బడుద్దాయి.

Devineni Uma

Devineni Uma – Kodali Nani : మాజీమంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి బూట్లు నాకగానే కారు కూతలు కూస్తావా? ఏంది నువ్వు కట్టింది టిడ్కో ఇళ్లు అంటూ విరుచుకుపడ్డారు. 2,62,216 ఇళ్లు చంద్రబాబు కడితే వాటికి రంగులేసుకుని మేము కట్టామని మాట్లాడుతున్నారు. అరేయ్ సన్నాసి.. కట్టిన వాడిని బిల్డర్ అంటారు రంగులు వేసిన వాడిని పెయింటర్ అంటారు బడుద్దాయి. నువ్వేం చేసావో చెప్పరా? అంటూ ఫైర్ అయ్యారు. సీఎంఎఫ్ఎస్ లో ఎప్పుడెప్పుడు ఈ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టారో బయట పెట్టండి? అని దేవినేని డిమాండ్ చేశారు.

”కల్వర్టు నిర్మాణాలు కూడా చేయకుండా ముఖ్యమంత్రి గొట్టం కొడుతున్నాడు. ఎన్నికల ముందు అన్నీ ఫ్రీ అని.. నేడు 300 స్క్వేర్ యార్డ్స్ అంటున్నారు. రూపాయికి ఇల్లు ఇస్తాను అని డ్రామాలు ఆడుతూ నాలుగేళ్లు నడిపారు. నీ సొల్లు వాగుడు ఆపి నీకు సిగ్గు శరం పౌరుషం ఉంటే నువ్వు అన్నం తింటే పునాదులు ఎప్పుడు పడ్డాయి? నిర్మాణాలు ఎప్పుడు చేశారు? బయట పెట్టండి.

Also Read..Sarvepalli Constituency: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. ఈసారి పైచేయి ఎవరిదో.. సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది?

తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీరు వేసిన రంగులు మొత్తం తీసేసి మళ్లీ చంద్రబాబుతో ఎన్టీఆర్ విగ్రహం పెడతాం. టిడ్కో ఇళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి? సన్నబియ్యం సన్నాసి, అచ్చోసిన ఆంబోతు, మానవ మృగం, అబద్దాలకోరు. చంద్రబాబు కాళ్ళ మీద పడి బూట్లు నాకి రెండుసార్లు బీఫామ్ తీసుకొని డబ్బులు తెచ్చుకొన్నాడు. అధికారులు పోస్టింగ్ లకు కక్కుర్తి పడి టిడ్కో ఇళ్లపై తప్పుడు మాటలు మాట్లాడారు.

ఈ కారుకూతలు కూసిన టిట్కో చిన్నోడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊచలు లెక్క పెడతాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల మెప్పు కోసం ఆరాటపడే అధికారులను ఎవరూ క్షమించ లేరు. రేపు మీ దారులన్నీ మూసుకుపోతాయి” అని హెచ్చరించారు దేవినేని ఉమ.

ట్రెండింగ్ వార్తలు