Ambati Rambabu : కాస్కో బ్రో.. ఢిల్లీకి వెళ్తున్నా, ఆయనతో చర్చించాక ఎవరికి ఫిర్యాదు చేస్తామో చెప్తా- అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

బ్రో సినిమా పెట్టుబడులపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నిర్మాత చెప్పాల్సింది ఆయన చెప్పాడు. Ambati Rambabu

Ambati Rambabu On Bro Movie

Ambati Rambabu – Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో మూవీ ఏపీలో పొలిటికల్ మంటలు రేపుతోంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కల్యాణ్ మధ్య చిచ్చు రాజుకుంది. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర ద్వారా పవన్ కల్యాణ్ తనను కించపరిచారని అంబటి రాంబాబు రగిలిపోతున్నారు.

ఈ వ్యవహారాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఈ వివాదం మరో లెవెల్ కి చేరింది. బ్రో సినిమాకు టీడీపీ నుంచి నిధులు అందాయని, మనీ లాండరింగ్ జరిగిందని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ సినిమా లావాదేవీలపై అంబటి రాంబాబు కేంద్ర దర్యాఫ్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. మొత్తంగా బ్రో సినిమాపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి అంబటి రాంబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనపై అంబటి రాంబాబు స్పందించారు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారు? ఎవరిని కలుస్తారు? ఏం చేయనున్నారు? అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారాయన.

KA Paul: మోదీ దగ్గర వీరిని పవన్ కల్యాణ్ తాకట్టుపెడుతున్నారు: కేఏ పాల్

‘నేటి రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నా. ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించాక ఎవరికి ఫిర్యాదు చేస్తామో చెప్తా. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా. బ్రో సినిమా పెట్టుబడులపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నిర్మాత చెప్పాల్సింది ఆయన చెప్పాడు. సినిమాలో క్యారెక్టర్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసు.

నిర్మాతకు టీడీపీ నుండి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయని నాకు సమాచారం ఉంధి. నా దగ్గరున్న సమాచారం, ఆధారాలు దర్యాప్తు సంస్థలకు ఇస్తా. బ్రో సినిమా గురించే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు చేశాడు. వాటి గురించి మాట్లాడలేదు కదా. బ్రో లో నన్ను పోలిన క్యారెక్టర్ ఉంది కనుక దాని గురించి పూర్తిగా అధ్యయనం చేశాను. కీలక విషయాలు తెలుసుకున్నా. నాపై సినిమా తీస్తానని జనసేన పార్టీ నేతలు అంటున్నారు.. తీసుకోండి.. పవన్ కళ్యాణ్ ను హీరో గా పెట్టుకోండి..’ అని అంబటి రాంబాబు అన్నారు.

Janasena Leader Pothina Mahesh: జగన్‌పై వెబ్ సిరీస్.. తెల్ల జుట్టు ఉన్నా పర్లేదు.. వైసీపీలో నటులు కూడా ట్రై చేయొచ్చు..

ఏపీలో బ్రో సినిమా పంచాయితీ ముదురుతోంది. మంత్రి అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయారు.బ్రో సినిమాలో అంబటి రాంబాబు డ్యాన్స్ ను పోలిన డ్యాన్స్ ఉండటం వివాదానికి కారణమైంది. అచ్చం అంబటి డ్రెస్ వేసుకుని అవే స్టెప్పులు వేశారు నటుడు పృథ్వీ. శ్యాంబాబు పాత్రపైన, డ్యాన్స్ పైన మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తనను కించపరిచేలా ఆ సీన్ పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనను ఏమీ చేయలేకనే సినిమాలో ఇలా ఇమిటేట్ చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు