PM Modi In Visakha : ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు .. స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై ఏపీ ప్రజలు గంపెడు ఆశ పెట్టుకున్నారు.విభజన హామీల గురించి భరోసా ఇస్తారని..రైల్వే జోన్ గురించి చెబుతారని ఆశించారు. కానీ అవేవీ లేవు. ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..కానీ ప్రధాని మాత్రం తనదైన శైలిలో ఏపీ ప్రజలను ఆకాశానికెత్తేశారు. ఏపీ ప్రజలు ప్రతిభావంతులు అని..ఏపీ ప్రజలు ఎక్కడున్నా తమ ప్రతిభతో ప్రత్యేకతను చాటుకుంటారని చక్కటి గుర్తింపు తెచ్చుకంటుంటారని.. ఇలా ఏపీ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు. అలా ప్రధాని మరోసారి ఏపీకి మొండిచేయి చూపించారు,

PM Modi In Visakha : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై ఏపీ ప్రజలు గంపెడు ఆశ పెట్టుకున్నారు.విభజన హామీల గురించి భరోసా ఇస్తారని..రైల్వే జోన్ గురించి చెబుతారని ఆశించారు. కానీ అవేవీ లేవు. ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..కానీ ప్రధాని మాత్రం తనదైన శైలిలో ఏపీ ప్రజలను ఆకాశానికెత్తేశారు. ఏపీ ప్రజలు ప్రతిభావంతులు అని..ఏపీ ప్రజలు ఎక్కడున్నా తమ ప్రతిభతో ప్రత్యేకతను చాటుకుంటారని చక్కటి గుర్తింపు తెచ్చుకంటుంటారని.. ఇలా ఏపీ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తారు. వీటితో ఏపీ ప్రజలకు ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ విషయం సామాన్యులకు కూడా అర్థం అవుతోంది.

ప్రియమైన సోదరీ సోదరులారా అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని..10 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని..విశాఖ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామంటూ చెప్పుకొచ్చారు. ఏపీకి చెందిన బీజేపీ నేతలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు నేను ఎప్పుడు సమావేశం అయినా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటాం అని ఏపీ అభివృద్ధే తమ ప్రభుత్వం ఆకాంక్ష అన్నట్లుగా చెప్పి ప్రజల్ని మరోసారి మాయలో పడేశారు.

మరోసారి ఏపీకి మొండిచేయి చూపించిన ప్రధాని మోడీ..
ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడారు.అదికూడా ముందుగా నిర్ణయించిన ప్రాజెక్టుల గురించి మాత్రమే మాట్లాడారు.దీంట్లో భాగంగా వర్చువల్ గా కొన్ని ప్రాజెక్టులకు వేదికపై నుంచే శంకుస్థాపన చేశారు. ఏపీ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తి తన ఏపీ పర్యటన ఇదేనంటూ మరోసారి విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి మొండిచేతులు చూపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పాల్గొననున్నారు.

దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ తమ ప్రభుత్వం ఘనతను చెప్పుకున్న రైల్వే మంత్రి..
ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. కానీ భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. సంక్షోభంలో ఉన్న ప్రతిదేశం నేడు భారత్ వైపు చూస్తోందన్నారు. దేశంలో సామాన్యుల ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్న ప్రధాని.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. వారికి అన్నివిధాల అండగా నిలిచేందుకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉచితంగా బియ్యం అందిస్తున్నామని, పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నామని ప్రధాని తెలిపారు. యువతకు అంకుర పరిశ్రమల్లో చేయూత అందిస్తున్నామన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు