CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్) అయితే, గత ప్రభుత్వంలో డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) అన్నట్లు పాలన సాగిందని జగన్ విమర్శించారు.

CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి నాలుగో విడుత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొని బటన్ నొక్కి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని, అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో దోపిడీ పాలన సాగిందని, వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి పైరవీ లేకుండా, లంచాలు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని జగన్ చెప్పారు. మనది డీబీటీ (డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్) అయితే, గత ప్రభుత్వంలో డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) అన్నట్లు పాలన సాగిందని జగన్ అన్నారు.

CM YS Jagan: మీ పిల్లల చదువు బాధ్యత నాదే.. తలరాతలు మార్చే శక్తి చదువుకే ఉంది.. జగన్న విద్యాదీవెన నిధులు విడుదల

పొత్తుల విషయంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని జనసేన, టీడీపీ పార్టీలనుద్దేశించి జగన్ ప్రశ్నించారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకం అవుతున్నాయి? ఎందుకు పొత్తులకోసం వెంప్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది మంచి మాత్రమేనని జగన్ అన్నారు. సినిమాల్లో హీరోలు మాత్రమే నచ్చుతారు. విలన్లు కాదని జగన్ వ్యాఖ్యానించారు.

AP CM YS Jagan: మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్

వైసీపీ ప్రభుత్వం పాలన సరిగా లేదని ఒకపక్క అంటూనే, మళ్లీ పొత్తులకోసం ఎందుకు పాకులాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. నిజంగా మీకు ప్రజల్లో బలముందని అనుకుంటే 175 స్థానాల్లో పొత్తులు లేకుండా పోటీచేయాలని జగన్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అప్పుల పెరుగుదల తక్కువేనని జగన్ అన్నారు. గతంలో దోపిడీ పాలన సాగితే, ప్రస్తుతం వైసీపీ హయాంలో అర్హులున్న ప్రతీ పేదవాడికి న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు