AP Cabinet : మంత్రి పదవి రానందుకు బాధ లేదు..వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా : మాజీ హోంమంత్రి సుచరిత

మంత్రి పదవి రానందుకు బాధ లేదు..వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను అంటూ ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు.

AP Cabinet : ఏపీ సీఎం మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎంతోమంది ఆశావహులకు మనస్తాపానానికి గురి అయ్యారు. మంత్రి పదవి రానందుకు అలకబూనారు.దాంతో అసంతృప్తులతో రగిలిపోతున్నారు వారు. వారు, వారి అనుచరగణాలు. దీంట్లో భాగంగానే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మనస్తాపం చెందారు. దీంతో సుచరిత ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ పైకి మాత్రం తనకు మరోసారి మంత్రి పదవి దక్కలేదని ఏమాత్రం బాధలేదనీ..కానీ కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని అవే తనను బాధిస్తున్నాయని..అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశాను అని చెప్పుకొచ్చారామె.

వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని..కానీ పదవిలో లేకపోయినా రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ కోసమే పనిచేస్తాను అని..నా వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదు అని చెప్పొకొచ్చారు మాజీ హోంమంత్రి సుచరిత.కాగా..మొదటి విడత క్యాబినెట్ లో ఏకంగా హోం మంత్రి దక్కించుకున్న సుచరిత రెండోసారి దెబ్బతిన్నారు. మంత్రి పదవి కోల్పోయారు. మొన్నటిదాకా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న ఆమెకు.. ఈసారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు.

తాజాగా ఈ విషయాన్ని సుచరిత అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని,చేశానని కూడా తెలిపారు.కానీ పదవిలో లేకపోయినా పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. కానీ ఆమెను నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు మాత్రం అసంతృప్తులను భరించలేకప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.

ట్రెండింగ్ వార్తలు