Bopparaju Venkateshwarlu : ఉద్యోగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళన : బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనల నేపద్యంలో 4 టీమ్ లు గా ఏర్పడ్డామని తెలిపారు.

Bopparaju Venkateshwarlu : ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. అందుకు నిరసనగా ఈనెల (మార్చి) 9 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనల నేపద్యంలో 4 టీమ్ లు గా ఏర్పడ్డామని తెలిపారు. తమ ఉద్యమానికి ఏపీ సీపీఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టబద్దంగా రావాల్సినవి‌‌ ఇవ్వకపోవడం, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే తమ ఉద్యమమని స్పష్టం చేశారు.

11 వ PRC ప్రకటించినా బకాయి ఎప్పుడు చెల్లిస్తారో, ఎంత వస్తుందో బిల్లులు చేయించలేదని చెప్పారు. డీఏ ఏరియర్స్ లక్షలాది రూపాయల ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని.. రిటైర్ అయిన వారికి బకాయి చెల్లించలేదని విమర్శించారు. ఏడాదిగా పోలీస్ లకు సరండర్ లీవులకు చెల్లింపులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము దాచుకున్న జీపీఎఫ్ సంగతి ఏంటని ప్రశ్నించారు. తాము దాచుకోవడమే నేరమా? ఆ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని చెపుతున్నారు….అవి ఏమయ్యాయని నిలదీశారు.

No CPS Only OPS : సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే-ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ ఉద్యోగులు తమ వాటా కింద 1200 కోట్లు ఏమయ్యాయని అడిగారు. ఈ అన్యాయాలను ప్రజలందరికీ తెలియాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు….వారం రోజుల్లో చేస్తామన్నారు ఏమైందని ప్రశ్నించారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేస్తే .. వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్ప ఏమి చేశారని నిలదీశారు. జీపీఎస్ విధానాన్ని పూర్తిగా తోసి పుచ్చాము‌.. చర్చలకి రాబోమని చెప్పామని తెలిపారు. రాజస్ధాన్, ఛత్తీస్ ఘడ్ లలో పాత పెన్షన్ విధానం అమలు సమీక్షించడానికి తీసుకెళ్లి మళ్లీ ఎందుకు మాటమారుస్తున్నారని నిలదీశారు.

రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారని.. మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా వయస్సు అయ్యిపోయే వరకూ మీరేమైనా సేవ చేస్తున్నారా‌? ప్రశ్నించారు. వారికి ఇచ్చే రాయతీలు ప్రపంచంలో ఎవ్వరూపొందరు.. వారి జీతాలు వారే నిర్ణయించుకుంటారు….వారికి పీఆర్సీలతో సంబంధం లేదా? సీపీఎస్ దుర్మార్గమని అన్యాయమని మీరే చెప్పి ఇంకా ఆలస్యం దేనికని నిలదీశారు.

AP CPS : సీపీఎస్ విషయంలో ఏపీ సర్కార్ కొత్త ప్రతిపాదన

కాంట్రాక్టు ఉద్యోగులు 22 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నారని, వారిని క్రమబద్దీకరణ చేస్తామని నమ్మించారని.. ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరిస్తుందన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచుతామని.. పెంచలేదని విమర్శించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి స్వఛ్ఛందంగా పాల్గొనాలని.. తమలో ఐక్యత ఉందని చెప్పాలన్నారు. ఏపీ ఎన్జీఓ జేఏసీ కూడా భాగస్వాములు కావాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు