Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎందుకు? సజ్జల కీలక వ్యాఖ్యలు

జగన్ ఏంటి అనేది జనానికి క్లారిటీ ఉంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గురించి, కొంత మంది వ్యక్తుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.

10TV Conclave : విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ సీనియర్ జర్నలిస్ట్.. సీఎం జగన్ ప్రెస్ మీట్ గురించి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎందుకు? అని అడిగారు. దీనికి సజ్జల సమాధానం ఇచ్చారు.

”ఒక్కో లీడర్ వ్యవహారశైలి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ పబ్లిక్ లోనే ఉంటారు. కొందరు చేతల్లో చూపించాలని అనుకుంటారు. జగన్ రెండో రకం. మాటల్లో కన్నా చేతల్లో చూపించాలని అనుకుంటారు. జగన్ అపోజిషన్ లో ఉన్న సమయంలోనూ అదే తీరు. పెద్దగా ప్రెస్ మీట్ పెట్టింది లేదు. చెప్పేది స్పష్టంగా ఉండాలని అనుకుంటారు. ఆయన చేతలే ఆయన మాటలు అనుకోవాలి.

ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. ప్రభుత్వంలోకి వచ్చాక రివ్యూలు చేస్తున్నారు. అందులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. జగన్ ఏంటి అనేది జనానికి క్లారిటీ ఉంది. ఆయన పది మాటల్లో చెప్పలేనిది ఒక యాక్షన్ లో చూపించారు. దాన్ని జనం యాక్సెప్ట్ చేశారు. జనాలకు క్లారిటీ ఉంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా గురించి, కొంత మంది వ్యక్తుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు” అని సజ్జల రాకమృష్ణారెడ్డి అన్నారు.

Also Read : నేను ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధం: సజ్జల

 

ట్రెండింగ్ వార్తలు