10Tv Conclave : ఏపీ రాజధాని అదే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.

10Tv Conclave : ఏపీ రాజధాని అమరావతే అని తేల్చి చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. వైసీపీ పాలనపై ఆమె విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. భారీగా అప్పులు పెంచిందన్నారు. అభివృద్ధి మాత్రం శూన్యం అని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.

”ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీలో అభివృద్ది జరగలేదు. అభివృద్ది కుంటుపడిన విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా చేసిన అప్పుల గురించి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఏపీ అప్పుల అంశం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయి మీడియాలోనూ డిస్కషన్ జరిగింది. దాదాపుగా 14లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రం మీద ఉంది. అంత అప్పు తీసుకొచ్చినప్పుడు.. కనీసం ఆస్తి సృష్టి అన్నది జరగాలి. కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. యువత దారితప్పింది. రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు సరిగా లేవు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు” అని పురంధేశ్వరి అన్నారు.

విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన, అప్పులు, అభివృద్ధి, కూటమి గెలుపు అవకాశాలు.. ఇలా తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read : ప్రజల కోసమే పవన్ కల్యాణ్ ఆ త్యాగం చేశారు, వైసీపీ ఓటమి ఖాయం- కేశినేని చిన్ని

ట్రెండింగ్ వార్తలు