10Tv Conclave : ప్రజల కోసమే పవన్ కల్యాణ్ ఆ త్యాగం చేశారు, వైసీపీ ఓటమి ఖాయం- కేశినేని చిన్ని
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.

Kesineni Chinni 10tv Conclave Ap RoadMap
10Tv Conclave : ప్రజల కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీట్లను త్యాగం చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ అభివృద్ధి మొత్తం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం 80శాతం పూర్తి చేసింది టీడీపీనే అన్నారు. అమరావతి రావాలి యువత బాగుపడాలి అని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు చిన్ని. ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు.
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు. అన్ని సర్వేల్లో తనకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయని చిన్ని చెప్పారు. చంద్రబాబును గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారని వ్యాఖ్యానించారు. విజయవాడలో నాకు అందరి మద్దతు ఉందన్న చిన్ని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ హోటల్ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు.పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
Also Read : దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది- తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు