×
Ad

10Tv Conclave : మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలకు మేలు చేయటమే నా లక్ష్యం- కొల్లు రవీంద్ర

ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.

  • Published On : April 26, 2024 / 05:50 PM IST

10Tv Conclave : నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, మచిలీపట్నం ప్రజలకు మేలు చేయడమే నా లక్ష్యం అంటున్నారు మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర. వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు కొల్లు రవీంద్ర. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కక్షపూరిత పరిస్థితులు వచ్చాయని కొల్లు రవీంద్ర వాపోయారు. 2019 వరకు నా పై ఒక్క కేసు కూడా లేదన్న కొల్లు రవీంద్ర.. 2019 తర్వాత తనపై 24 కేసులు పెట్టారని చెప్పారు. అంటే ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో మాజీ మంత్రి, మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

Also Read : దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది- తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు