Asani Cyclone : బలహీనపడిన అసాని తుపాను

కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది.

Asani cyclone : బంగాళాఖాతంలో అసాని తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి తుపాను వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., కాకినాడకు 140 కి.మీ., విశాఖపట్నంకు 280 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Asani Cyclone: అసని ఎఫెక్ట్.. 37రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ

రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 60-80 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు