Amaravati : కోవిడ్ నిబంధనలు.. 40 లక్షల మందికి జరిమానా విధించిన అధికారులు

కరోనా నిబంధనలు ఇళ్లగించిన వారిపై అధికారులు కరోనా జుళిపిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ విధిస్తున్నారు.

Amaravati : కరోనా నిబంధనలు ఇళ్లగించిన వారిపై అధికారులు కరోనా జుళిపిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ విధిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా జరిమానాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో అక్టోబర్ 15 నాటికీ కరోనా నిబంధనలు ఉల్లఘించి జరిమానా కట్టిన వారు 40,33,798 మంది అని.. వారు కట్టిన జరిమానా రూ. 31,87,79,933గా తేలింది.]

చదవండి : Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు?

అత్యధికంగా విశాఖ జిల్లాలో 11.41 లక్షల మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గణాంకాల్లో వెల్లడైంది. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారు విశాఖపట్నంలో ఎక్కువగా ఉండగా, జరిమానా వసూళ్లలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా నుంచి రూ.6.01 కోట్లు వసూలయ్యాయి. రెండవ ప్లేస్ లో అనంతపురం జిల్లా నిలిచింది.

చదవండి : Corona Vaccine : చెత్తకుప్పలో 1.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. భారీగా టీకాల వృథా

ఇక్కడ 4.88 లక్షల మంది నిబంధనలు ఉల్లంగించిగా.. రూ.4.98 కోట్లకు పైగా వసూలైంది. అతి తక్కువ ఫైన్ కట్టిన జిల్లాలు గుంటూరు, శ్రీకాకుళం.. ఇక్కడ కోటికి తక్కువే జరిమానా వసూలైంది. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఇక్కడ తక్కువమంది ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు