Corona Vaccine : చెత్తకుప్పలో 1.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు.. భారీగా టీకాల వృథా

మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు..

Corona Vaccine Wastage : మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు పెద్దఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. అందరికీ ఉచితంగానే టీకా పంపిణీ చేస్తున్నాయి. ఎలాంటి అపోహలు, అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సిన్ దే కీ రోల్. అదీ టీకాకున్న ప్రాముఖ్యత. అలాంటి టీకా కొన్ని చోట్ల భారీ ఎత్తున వృథా అవుతోంది. చెత్త పాలవుతోంది.

Samantha : సినిమా చేయాలంటే కొత్త కండిషన్లు పెడుతున్న సమంత.. విడాకుల ఎఫెక్ట్?

ప్రపంచంలో కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్లు లేక ఇబ్బందులు పడుతుంటే, అగ్రరాజ్యం అమెరికా మాత్రం భారీగా టీకాలను వృథా చేస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో అమెరికాలో 15 మిలియన్ల(1.5కోట్లు) డోసులను చెత్తలో పడేశారని ఆ దేశ సీడీసీ తెలిపింది. అందులో కొన్ని ఎక్స్ పైర్ అయ్యాయని చెప్పింది. వ్యాక్సిన్ వయల్ పగిలిపోవడం, సూదులు పని చేయకపోవడం, కరెంట్ లేక ఫ్రీజర్స్ ఆగిపోవడం వంటి పలు కారణాలతో టీకాలు వృథా అవుతున్నాయి. కొన్ని సార్లు పౌరులు వ్యాక్సిన్ తీసుకోవడానికి రాకపోవడం, వారి కోసం కేటాయించిన వయల్ నిరుపయోగం కావడం కూడా టీకాల వృథాకు కారణమే.

లూసియానాలో ఉపయోగించని 2లక్షల 24వేల వ్యాక్సిన్ డోసులు చెత్త పాలయ్యాయి. అందులో కొన్ని వయల్స్ పగిలిపోవడం వల్ల వృథా అయ్యాయి. కాగా, చాలా వరకు(20వేల షాట్స్) ఎక్స్ పైరీ అయ్యాయి. విస్కాన్ సిన్ లో రోజూ వేల సంఖ్యలో డోసులు వృథా అయ్యాయి. అలబామాలో 65వేలకు పైగా వ్యాక్సిన్ డోసులు చెత్త పాలయ్యాయి. టెన్నిసీలో మరీ దారుణం. అక్కడ 2లక్షల డోసులు వృథా అయ్యాయి.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

ఇంకా చాలా దేశాల్లో తీవ్రమైన టీకాల కొరత ఉంది. కొన్ని దేశాల్లో పౌరులకు ఇంకా తొలి డోసు కూడా అందలేదు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో కేవలం 1శాతం జనాభాకు మాత్రమే టీకా తొలి డోసు అందింది.

వృథా అయిన డోసుల్లో చాలా వరకు ఫార్మసీల నుంచి వచ్చినవే. Walgreens, CVS, Walmart, Rite Aid ఫార్మసీల నుంచి వచ్చిన టీకాలు ఎక్కువగా వృథా అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు