RGV : తమిళ్ స్టార్‌తో ఆర్జీవీ భేటీ.. సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నావా బ్రో..

తాజాగా ఆర్జీవీ ఓ తమిళ్ స్టార్ తో దిగిన ఫోటో వైరల్ అవుతుంది.

RGV – Vijay Sethupathi : ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటూ టైం పాస్ చేస్తూ, తన సినిమాలు, తన ట్వీట్స్ తో వైరల్ అవుతూ ఉన్నాడు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషయంపై ట్వీట్స్ వేస్తూ యాక్టివ్ గా ఉంటూ హల్ చల్ చేస్తాడు. ఇటీవల ఆర్జీవీ స్టార్ హీరోలు, హీరోయిన్స్ ని కలవట్లేదు.

ఆర్జీవీ అసలు పెద్ద సినిమాలు, స్టార్ నటీనటుల జోలికి వెళ్లడమే మానేసాడు. కానీ తాజాగా ఆర్జీవీ ఓ తమిళ్ స్టార్ తో దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ఆర్జీవీ నిన్న చెన్నై వెళ్లారు. చెన్నైలో తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని తన ఆఫీస్ లోనే కలిశాడట రామ్ గోపాల్ వర్మ. విజయ్ సేతుపతితో ఆర్జీవీ మాట్లాడుతుండగా తీసిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. విజయ్ సేతుపతిని చాలా సార్లు స్క్రీన్ మీద చూసిన తర్వాత, ఇప్పుడు నిజంగా ఇతన్ని కలిసాక స్క్రీన్ మీద కంటే బయటే చాలా బాగున్నాడు అని పోస్ట్ చేసాడు ఆర్జీవీ.

Also Read : Upasana – Ram Charan : ఒమన్ దేశంలో ఫ్యామిలీతో ఉపాసన.. చరణ్ గురించి పొగుడుతూ స్పెషల్ పోస్ట్..

దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. అసలు ఎలాంటి పని లేకుండా ఎవర్ని కలవని ఆర్జీవీ చెన్నై వెళ్లి మరీ విజయ్ సేతుపతిని తన ఆఫీస్ లోనే కలిసాడంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. విజయ్ సేతుపతితో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా? లేక ఏదైనా ఈవెంట్ కోసం వేరే వాళ్ళ ద్వారా కలిశాడా? అనుకోకుండా కలిశాడా అనేది తెలియదు కానీ వీరిద్దరి ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు