Upasana – Ram Charan : ఒమన్ దేశంలో ఫ్యామిలీతో ఉపాసన.. చరణ్ గురించి పొగుడుతూ స్పెషల్ పోస్ట్..

తాజాగా చరణ్ - ఉపాసన ఒమన్ దేశానికి వెళ్లారు.

Upasana – Ram Charan : ఒమన్ దేశంలో ఫ్యామిలీతో ఉపాసన.. చరణ్ గురించి పొగుడుతూ స్పెషల్ పోస్ట్..

Ram Charan and Upasana Went to Oman Country Upasana Shares Photos

Upasana – Ram Charan : టాలీవుడ్ కపుల్ రామ్ చరణ్ – ఉపాసన ఇటీవల ఉపాసన ఫ్యామిలీ, రిలేటివ్స్ తో ఒమన్ దేశానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ గురించి, చరణ్ తో దిగిన ఫోటోలు, వీడియోలు, వెకేషన్ ఫొటోలు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులు కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల చరణ్ – ఉపాసన జంట ఎక్కడికి వెళ్లినా తోడుగా తమ పాపాయి క్లిన్ కారాని కూడా తీసుకెళ్తున్నారు.

Also Read : Chiranjeevi : నెల రోజుల గ్యాప్ తర్వాత.. మళ్ళీ ‘విశ్వంభర’ షూట్ మొదలు పెట్టిన మెగాస్టార్.. ఎక్కడంటే..?

తాజాగా చరణ్ – ఉపాసన ఒమన్ దేశానికి వెళ్లారు. ఉపాసన ఫ్యామిలీకి చెందిన జైదుస్ అనే కంపెనీ వర్క్ మీద వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉపాసన ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా వీరితో కలిసి సందడి చేసారు. ఒమన్ దేశంలో ఉపాసన చరణ్ తో, తమ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉపాసన ఈ ఫోటోలను షేర్ చేసి.. రామ్ చరణ్ నాకు గర్వ కారణం. నేను వర్క్ లో ఉన్నప్పుడు నాన్నగా బాధ్యతలు తీసుకొని నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు. ఈ మీటింగ్ ని స్పెషల్ గా చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక జైదుస్ కంపెనీ గొప్ప కంపెనీ, గొప్ప ఫలితాలు రాబడుతుంది అని తెలిపింది.

దీంతో ఉపాసన షేర్ చేసిన చరణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఫొటోలో ఉపాసన, చరణ్ ఎక్కడో పెద్ద కొండ మీదకు వెళ్లి దిగినట్టు తెలుస్తుంది. మరో ఫొటోలో చరణ్ ఉపాసన రిలేటివ్స్, ఆ కంపెనీ ప్రతినిధులతో దిగినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ఫొటోలో క్లిన్ కారా కూడా వీరితో ఉంది.