Chiranjeevi : నెల రోజుల గ్యాప్ తర్వాత.. మళ్ళీ ‘విశ్వంభర’ షూట్ మొదలు పెట్టిన మెగాస్టార్.. ఎక్కడంటే..?

నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ మొదలుపెట్టారని తెలుస్తుంది.

Chiranjeevi : నెల రోజుల గ్యాప్ తర్వాత.. మళ్ళీ ‘విశ్వంభర’ షూట్ మొదలు పెట్టిన మెగాస్టార్.. ఎక్కడంటే..?

Megastar Chiranjeevi Resume Vishwambhara Shoot after One Month Gap

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ(Director Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర'(Vishwambhara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్స్ చేస్తుంది.

ఇటీవల నెల రోజుల క్రితం ఏప్రిల్ మొదట్లో విశ్వంభర సినిమా ఇంటెర్వెల్ యాక్షన్ సీన్ ని ఆల్మోస్ట్ 22 రోజుల పాటు షూట్ చేసారు. హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల్ వద్ద పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, సెట్ ఏర్పాటు చేసి ఈ యాక్షన్ సీన్ షూట్ చేసారు. ఆ సెట్ నుంచి చిరంజీవి, త్రిష ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ కి గ్యాప్ తీసుకున్నారు.

Also Read : Kajal Aggarwal : మహేష్ బాబు డిజాస్టర్ సినిమా తన ఫేవరేట్ అంటున్న కాజల్.. ఏ సినిమా అంటే?

ఈ గ్యాప్ లో మెగాస్టార్ భార్యతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లి రావడం, ఎన్నికలు, పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం.. ఇలా వేరేవేరే పనులతో బిజీగా ఉన్నారు. తాజాగా మళ్ళీ నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ మొదలుపెట్టారని తెలుస్తుంది. నేటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో విశ్వంభర షూటింగ్ జరుగుతుందని సమాచారం. మరో భారీ షెడ్యూల్ నే ప్లాన్ చేసాడట డైరెక్టర్ వశిష్ఠ.