IPL 2024 : ఎస్ఆర్‌హెచ్‌ ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఇవే.. మార్చుకోకుంటే ఫైన‌ల్‌కు చేరడం కష్టమే

కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సమఉజ్జీల సమరంగా క్రికెట్ అభిమానులు భావించారు. మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. కానీ, హైదరాబాద్ జట్టు పేలువ ప్రదర్శనతో ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు

KKR vs SRH Qualifier-1 Match : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో 164 పరుగులు చేశారు. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ దూసుకెళ్లారు.

Also Read : SRH vs KKR IPL 2024 : క్వాలిఫయర్‌-1లో హైదరాబాద్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన కోల్‌కతా

కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సమఉజ్జీల సమరంగా క్రికెట్ అభిమానులు భావించారు. మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. కానీ, హైదరాబాద్ జట్టు పేలువ ప్రదర్శనతో ఫ్యాన్స్ చిన్నబుచ్చుకున్నారు. అయితే, హైదరాబాద్ జట్టు ఓటమికి ప్రధానంగా మూడు కారణాలను క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు ప్రతీమ్యాచ్ లోనూ బ్యాటింగ్ విభాగంలో అటాకింగ్ గేమ్ ను ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ లు దూకుడుగాఆడి పరుగుల వరద పారించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లుసైతం అదే ఊపును కొనసాగిస్తూ ప్రత్యర్థులకు భారీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వచ్చారు. క్వాలీఫయర్ -1 మ్యాచ్ లోనూ ఎస్ఆర్ హెచ్ అదే వ్యూహాన్ని అమలు చేసింది. కానీ, స్టార్క్ బౌలింగ్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓపెనర్లు తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యారు. ఒకానొక దశలో ఆ జట్టు 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయిన, తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లుసైతం దూకుడుగాఆడే ప్రయత్నం చేసి వరుసగా వికెట్లు కోల్పోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరినప్పుడు మిగిలిన బ్యాటర్లు కాస్త క్రీజులో నిలదొక్కకునేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read : Ambati Rayudu : బీసీసీఐ అలా చేస్తే.. మ‌రికొన్నాళ్లు ధోని ఐపీఎల్‌లో ఆడ‌తాడు

ఇప్పటి వరకు పాట్ కమిన్స్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ, కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో పెద్ద తప్పు చేశాడు. ఎస్ఆర్ హెచ్ ప్లేయింగ్ ఎలెవన్ లో రెగ్యులర్ స్పిన్ బౌలర్ లేడు. దీని కారణంగా జట్టు పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్ పైనే ఆధారపడింది. ఫలితంగా ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అతడు 10 బంతుల్లో 32 పరుగులు ఇచ్చాడు. మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంపిక విసయంలోనూ ఎస్ఆర్ హెచ్ జట్టు అంచనా తప్పైంది. జట్టు బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న సమయంలో అభిషేక్ శర్మ స్థానంలో సన్వీర్ సింగ్ ను ఇంపాక్ట్ ప్లెయర్ గా తీసుకున్నారు. కానీ, సన్వీర్ సింగ్ తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. సన్వీర్ కంటే వాషింగ్టన్ సుందర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొని ఉండిఉంటే కొంచెమైనా మెరుగైన ఆప్షన్ గా ఉండేది.

మరోవైపు ఫీల్డింగ్ విషయంలో ఎస్ఆర్ హెచ్ జట్లు ప్లేయర్లు తప్పిదాలు చేశారు. పలు సార్లు క్యాచ్ లను మిస్ చేయడంతోనూ కోల్ కతా జట్టు విజయం సునాయాసం అయింది. కేకేఆర్ జట్టుతో మ్యాచ్ సమయంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటే.. ఈనెల 24న జరిగే క్వాలిఫయర్ 2లో నెగ్గి ఫైనల్ కు వెళ్లే అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పుష్కలంగా ఉన్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు