ఉత్తరాదిన భానుడి భగభగలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

High Temperatures : ఉత్తరాది రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది. ఢిల్లీలో ఎల్లో అలర్ట్ తదుపరి ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ను ఐఎండి జారీ చేసింది. ఉదయం 7గంటలకే 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో ఎండ వేడిమికి బయటకు వచ్చేందుకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇవాళ గరిష్టంగా 44 డిగ్రీలు కనిష్టంగా 31 డ్రిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే తప్ప బయటకి రావద్దని, ఇంట్లోనే ఉండి ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచనలు చేశారు.

Also Read : Naga Chaitanya : నాగచైతన్య కొత్త కారు భలే ఉందిగా.. ఈ లగ్జరీ స్పోర్ట్స్ మోడల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ధర ఎంతంటే?

ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 28 నుంచి 30 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో మే 25న జరిగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై రికార్డు స్థాయిలో నమోదువుతున్న ఉష్ణోగ్రతలు ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో 47.8 డిగ్రీల సెల్సియస్‌, ఆగ్రాలో 47.7 డిగ్రీలు, సఫ్దర్‌జంగ్‌లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే నజాఫ్‌గఢ్ ప్రాంతంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఎండ వేడిమి పెరగడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఢిల్లీని జూపార్కులో జంతువులు ఎండ వేడిమిని తట్టుకునేలా జూ అధికారులు ఏర్పాట్లు చేశారు..

 

ట్రెండింగ్ వార్తలు