కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.

CM Revanth Reddy Tirumala Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శ్రీవారి దర్శనానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటిని పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమలలో సత్రాలు, కల్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తున్నామని, ఈ మేరకు త్వరలోనే ఏపీ సీఎంను కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. నీటి సమస్యలుతీరి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని రేవంత్ పేర్కొన్నారు.

Also Read : Chiranjeevi : నెల రోజుల గ్యాప్ తర్వాత.. మళ్ళీ ‘విశ్వంభర’ షూట్ మొదలు పెట్టిన మెగాస్టార్.. ఎక్కడంటే..?

ఇదిలాఉంటే.. మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రచన అతిథి గృహానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

 

 

ట్రెండింగ్ వార్తలు