BAN vs USA Match : టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు షాకిచ్చిన అమెరికా..

భారత మాజీ ప్లేయర్ హర్మీత్ సింగ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

BAN vs USA 1st T20 : టీ20 ప్రపంచకప్‌ 2024 టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. జూన్ 1వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు అమెరికా బిగ్ షాకిచ్చింది. అమెరికాపై బంగ్లాండ్ దేశ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అమెరికా జట్టు విజయంలో భారత మాజీ ప్లేయర్ హర్మీత్ సింగ్ కీలక భూమిక పోషించాడు.

Also Read : IPL 2024 : మా ప్లాన్ బెడిసి కొట్టింది..! ఓటమి తరువాత ఎస్ఆర్‌హెచ్‌ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ – అమెరికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తౌహీద్ హృదయ్ 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అమెరికా 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించింది.

Also Read : IPL 2024 : ఎస్ఆర్‌హెచ్‌ ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఇవే.. మార్చుకోకుంటే ఫైన‌ల్‌కు చేరడం కష్టమే

ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన భారత మాజీ ప్లేయర్ హర్మీత్ సింగ్ 13 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరికొద్ది రోజులుగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో పసికూన అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జట్టు ఓడిపోవటం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు