IPL 2024 : మా ప్లాన్ బెడిసి కొట్టింది..! ఓటమి తరువాత ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు
కేకేఆర్ జట్టుపై ఓటమి తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్సన్ మాట్లాడారు. ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.

Pic: @BCCI
SRH Captain Pat Cummins : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ సన్ రైజర్స్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ ధాటికి ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.4 ఓవర్లలో 164 పరుగులు చేశారు. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన కేకేఆర్ జట్టు ఫైనల్స్ దూసుకెళ్లింది. ఎలిమినేట్ మ్యాచ్ ఇవాళ రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిపై ఈనెల 24న జరిగే మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ పోటీపడుతుంది.
Also Read : IPL 2024 : ఎస్ఆర్‌హెచ్ ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఇవే.. మార్చుకోకుంటే ఫైనల్‌కు చేరడం కష్టమే
కేకేఆర్ జట్టుపై ఓటమి తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడారు. ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవటానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ఫైనల్స్ కు చేరుకునేందుకు మాకు మరో అవకాశం ఉంది. అవకాశాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామనే నమ్మకం నాకుందని కమిన్స్ చెప్పాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో విజయం ఎవరిని వరిస్తుందో చివరి వరకు చెప్పడం కష్టంగా మారింది. మేము ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ తో ప్రారంభించాం. బ్యాటింగ్ విభాగంలో విఫలం కావటంతో తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయ్యాం. బౌలింగ్ లోకూడా రాణించలేకపోయామని కమిన్స్ చెప్పాడు.
Also Read : Ambati Rayudu : బీసీసీఐ అలా చేస్తే.. మరికొన్నాళ్లు ధోని ఐపీఎల్‌లో ఆడతాడు
మా ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. ప్రారంభంలో పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలంగా లభించింది. దాన్ని కేకేఆర్ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. కానీ, తర్వాత మాత్రం పిచ్ బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలించిందని కమిన్స్ పేర్కొన్నాడు. చెన్నైలో జరిగే క్వాలిఫయర్ -2లో తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని క్వాలిఫయర్ -2లో విజయం సాధిస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశారు.