AP Schools : ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 16వ తేదీ నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకే స్కూల్స్..
AP Schools : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటి పూట బడులు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Half day Schools
- ఏపీలో 16 నుంచి ఒంటిపూట బడులు
- ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్
- పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగింపు
AP Schools : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో ఒంటి పూట బడులు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు.
Also Read : Payyavula Keshav: ఈడీ.. రెడీ.. ఎందుకు, ఏ కేసులో? ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్‌గా పయ్యావుల కామెంట్స్
విద్యాశాఖ ఆదేశాలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
