TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు.. పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే..
TG 10th Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
TG 10th Exams
- తెలంగాణలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
- రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు
- పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
TG 10th Exams : తెలంగాణలో 10వ (SSC) తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రానున్నారు. వీరిలో 2,60,916 మంది అబ్బాయిలు కాగా.. 2,56,811 మంది అమ్మాయిలు. వీరితోపాటు గతంలో తప్పినవారు, పరీక్షలకు హాజరుకానివారు 10,512 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అయితే, ఈసారి టెన్త్ పరీక్షల విధానంలో కొన్ని మార్పులు చేశారు. వాటిలో ఒకటి ఐదు నిమిషాలు మినహాయింపు. ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది.. విద్యార్థులను 9.35గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి..
♦ మొదటి రోజు పరీక్షా కేంద్రానికి 45 నిమిషాల ముందు చేరుకోండి. మిగిలిన రోజుల్లో అరగంట ముందు వెళ్తే ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చు.
♦ మొదట ఓఎంఆర్ షీట్ లోని అన్ని వివరాలను విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించాలి
♦ పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాక చదవడం మానేయాలి. ప్రశాంతంగా ఉండాలి.
♦ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను అర్థం చేసుకున్న అనంతరం జవాబులు రాయండి.
♦ వేసవి దృష్ట్యా పరీక్షకు వెళ్లే ముందు పండ్లు, మజ్జిగ, పళ్ల రసాలు, తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోండి.
♦ విద్యార్థులు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.
♦ అలసట, నీరసంగా అనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలి.
♦ ఉదయం 9.35గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తరువాత వెళ్లితే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ 2026 షెడ్యూల్:
♦ మార్చి 14, 2026 (శనివారం): ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, పార్ట్-II
♦ మార్చి 18, 2026 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్
♦ మార్చి 23, 2026 (సోమవారం): థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
♦ మార్చి 28, 2026 (శనివారం): మ్యాథమెటిక్స్
♦ ఏప్రిల్ 2, 2026 (గురువారం): సైన్స్ పార్ట్-I (ఫిజికల్ సైన్స్)
♦ ఏప్రిల్ 7, 2026 (మంగళవారం): సైన్స్ పార్ట్-II (బయోలాజికల్ సైన్స్)
♦ ఏప్రిల్ 13, 2026 (సోమవారం): సోషల్ స్టడీస్
♦ ఏప్రిల్ 15, 2026 (బుధవారం): ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం, అరబిక్), స్ఎస్సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)
♦ ఏప్రిల్ 16, 2026 (గురువారం): ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం, అరబిక్).
