Chiru- Prabhas: కలిసి వస్తున్న మెగాస్టార్, రెబల్ స్టార్.. సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం.
ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్న చిరంజీవి-ప్రభాస్(Chiru- Prabhas).
Chiranjeevi and Prabhas films scheduled for release at the end of 2026.
- ఇంకా లేట్ అవడనున్న విశ్వంభర, ఫౌజీ విడుదల
- ఇయర్ ఎండింగ్ లో కలిసి రానున్న స్టార్స్
- త్వరలోనే అధికారిక ప్రకటన
Chiru- Prabhas; మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2026 ప్రథమార్ధంలో ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక ఈ ఏడాది ద్వితీయార్ధంలో మెగాస్టార్ చిరంజీవి తన సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో, ప్రభాస్ పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో వస్తుండటంతో టాలీవుడ్లో సరికొత్త జోష్ నెలకొంది.
ముందుగా మెగాస్టార్ నటిస్తున్న ‘విశ్వంభర’ విషయానికొస్తే.. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను అద్భుతమైన ‘చందమామ కథ’లా తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ సినిమాను 2025 సంక్రాంతికి అనుకున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం కారణంగా 2026 సమ్మర్ లేదా జూలై నెలకు వాయిదా వేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం (Chiru- Prabhas)పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా, 2026 ఇయర్ ఎండింగ్ నాటికి ఈ గ్రాండ్ మూవీ వెండితెరపై మెరవనుంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Anasuya: అనసూయ వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు జనార్దన్ అరెస్ట్!
మరోవైపు ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పౌజీ’. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ వార్ డ్రామాగా ఈ సినిమాగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 ఆగస్టు లేదా దసరా సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్రాథమికంగా భావించారు. కానీ, చిత్రం షూటింగ్, గ్రాఫిక్ వర్క్స్ చాలా వరకు పెండింగ్ లో ఉందట. ఆ కారణంగానే 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి పరిచయం అవుతుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూర్చుతున్నారు. ఇలా మెగాస్టార్ సోషియో-ఫాంటసీ మ్యాజిక్, ప్రభాస్ పీరియడ్ వార్ యాక్షన్ రెండు భిన్నమైన జోనర్లలో వస్తున్న ఈ సినిమాలు 2026 ఏడాది ఎండింగ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటాయి అనేది చూడాలి.
