Site icon 10TV Telugu

Kajal Aggarwal : మహేష్ బాబు డిజాస్టర్ సినిమా తన ఫేవరేట్ అంటున్న కాజల్.. ఏ సినిమా అంటే?

Kajal Aggarwal Says Mahesh Babu Disaster Movie is Her Favourite

Kajal Aggarwal Says Mahesh Babu Disaster Movie is Her Favourite

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచారు. ప్రస్తుతం కాజల్ సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడింది.

ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన టాప్ 3 సినిమాలు చెప్పమని అడగగా కాజల్ సమాధానమిస్తూ.. బ్రహ్మోత్సవం సినిమా నాకు చాలా ఇష్టం. అందులో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని తెలిపింది. అయితే బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లోనే డిజాస్టర్ సినిమా. ఫ్యామిలీ డ్రామాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ పరాజయం చూసింది. మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా చూసి తల పట్టుకున్నారు. ఈ సినిమాలో కాజల్ తో పాటు ప్రణీత, సమంత కూడా ఉండటం గమనార్హం.

Also Read : Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా ఓ సినిమా చేసింది తెలుసా? సినీ పరిశ్రమకు రాకముందే..

ఇక బ్రహ్మోత్సవం తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా, ఇప్పటి సత్యభామ సినిమా అంటే ఇష్టం అని తెలిపింది కాజల్. సీత మూవీ నటన పరంగా తనకు సంతృప్తి ఇచ్చిందని, ఇక సత్యభామ కెరీర్ లో మొదటి సారి ఫుల్ యాక్షన్ చేసానని అందుకే ఈ రెండు సినిమాలు ఇష్టమని తెలిపింది కాజల్. మహేష్ ఫ్లాప్ సినిమా అని కాజల్ చెప్పడంతో మహేష్ అభిమానులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Exit mobile version