Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా ఓ సినిమా చేసింది తెలుసా? సినీ పరిశ్రమకు రాకముందే..

కాజల్ అగర్వాల్ తను సినీ పరిశ్రమలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమా చేసినట్లు తెలిపింది.

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ చెల్లిగా ఓ సినిమా చేసింది తెలుసా? సినీ పరిశ్రమకు రాకముందే..

Kajal Aggarwal Worked with Aishwarya Rai before entry into Movies

Updated On : May 22, 2024 / 7:29 AM IST

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు 17 ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తుంది. కరోనా సమయంలో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ ‘సత్యభామ’(Satyabhama) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ(Satyabhama) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది. అయితే ఈ క్రమంలో తను సినీ పరిశ్రమలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమా చేసినట్లు తెలిపింది.

Also Read : Kajal Aggarwal : ‘ఢీ’ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి చందమామ కాజల్..

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో 2007లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతకు ముందే 2004 లో ‘క్యూన్ హో గయా నా’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్, సునీల్ శెట్టి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లెలి పాత్రలో కాజల్ కనిపించింది. అయితే ఆ పాత్ర కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది.

Also Read : Kalki Bujji : కల్కిలో ‘బుజ్జి’ కోసం ఏకంగా అన్ని కోట్లా? స్పెషల్‌గా గాల్లో ఎగిరేలా తయారుచేసి..

దీని గురించి కాజల్ మాట్లాడుతూ.. ముంబైలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది ఆ పాత్ర. అప్పటికి నాకు సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదు. వచ్చింది అని చేసేసాను. దానికి నాకు ఏం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. సరదాగా వెళ్లి సరదాగా చేసేసాను అని తెలిపింది.