Parvathipuram Politics : హీటెక్కిన పార్వతీపురం రాజకీయం.. బొబ్బిలి చిరంజీవులు, జోగారావు పరస్పర ఆరోపణలు

ఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు.

Bobbili Chiranjeevulu - Jogarao

Bobbili Chiranjeevulu – Jogarao : ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం రాజకీయం హీటెక్కుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుపై మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెరువులు, డీ పట్టా భూములు వదలకుండా 200 ఎకరాల వరకు కబ్జా చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్యే జోగారావు భూ బకాసురుడుగా మరారంటూ బొబ్బిలి చిరంజీవులు తీవ్ర ఆరోపణలు చేశారు.
చిరంజీవులు ఆరోపణలకు ఎమ్మెల్యే జోగారావు కౌంటర్ ఛాలెంజ్ విసిరారు. చిరంజీవులుకు దమ్ముంటే ఆ 200 ఎకరాల భూమి సర్వే నెంబర్లు సహా నిరూపించాలంటూ సవాల్ చేశారు.

Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. 2వేల కిలోమీటర్ల మైలురాయికి చేరువలో పాదయాత్ర

నిరూపిస్తే ఆ 200 ఎకరాలను పేదలకు పంచేస్తానంటూ వెల్లడించారు. లేకుంటే ప్రజల సమక్షంలో చిరంజీవులు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. “క్షమాపణ చెప్పకుంటే వారం రోజుల్లో మీ ఇంటిని ముట్టడిస్తాం” అంటూ ఎమ్మెల్యే జోగారావు చిరంజీవులును హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు