EX MP Kothapalli Geetha Arrests : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు..

అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 14,2022)హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు.

CBI arrests Aaraku former mp kothapalli geetha : ఆంధ్రప్రదేశ్ లోని అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 14,2022)హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రుణం తీసుకుని రుణం చెల్లించని కేసులో గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రూ.42.79 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు గీత దంపతులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు. గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు సీబీఐ అధికారులు తరలించారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రుణం తీసుకున్న డబ్బుని దారి మళ్లించారనే అభియోగాలతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు.

2015లో కొత్తపల్లి గీతపై సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. గీతతో పాటూ ఆమె భర్త, కంపెనీ ఎండీపై సీబీఐ కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ లోన్ వ్యవహారంలో మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపైనా సీబీఐ కేసులు నమోదు చేసింది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా బెంగళూరుకు తీసుకెళ్లారు.

కాగా కొత్తపల్లి గీత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం పార్టీకి దూరంగా ఉన్నారు.. కొంతకాలం టీడీపీకి దగ్గరయ్యారు. అనంతరం ఆమె రాజకీయాలకు దూరంగా ఉండి.. కొద్దిరోజులకు 2018లో జనజాగృతి పేరిట రాజకీయ పార్టీని నెలకొల్పారు. అనంతరం ఆమె బీజేపీలో చేరి తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు.. ఆ తరువాత గీత పెద్దగా కనిపించలేదు.

కొత్తపల్లి గీత దంపతుల పైన బ్యాంకులో రుణం తీసుకొని ఎగ్గొట్టారనే అభియోగాలు ఉన్నాయి. విశ్వేశ్వర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ 42.79 కోట్ల రుణం పొందారు. తిరిగి చెల్లించకుండా రుణం ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ఫిర్యాదుతో 2015 జూన్ 30న ఈ కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు కారణంగానే రాజకీయంగా కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు