TDP MLC Ashokbabu : డీకామ్ బదులు బీకామ్ పడింది – అశోక్ బాబు.. అరెస్టును ఖండించిన బాబు

019లోనే ఈ కేసు ముగిసిందన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు అశోక్ బాబు. మరోవైపు...ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును...

Chandrababu Condemned : టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుపై గతంలో అశోక్ బాబు వివరణ ఇచ్చారు. డీకామ్‌ బదులుగా బీకామ్‌ అని తప్పుగా పడిందని చెప్పారు. 2019లోనే ఈ కేసు ముగిసిందన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు అశోక్ బాబు. మరోవైపు…ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Ukraine – Russia : ఉక్రెయిన్‌‌కు మూడు వైపులా రష్యా సైనిక బలగాలు.. శాటిలైట్ చిత్రాలు

తప్పుడు కేసు పెట్టి అశోక్‌ బాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు నారా లోకేశ్. అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

Read More : UP Election 2022: యూపీలో పోలింగ్ శాతం ఏం చెబుతోంది.. అధికార మార్పు జరుగుతుందా?

ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు. దీంతో 2022, ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి విజయవాడలోని అశోక్ బాబు ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అంటించారు. అనంతరం అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు. ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు