AP Politics: పవన్ కల్యాణ్ మీద పరువు నష్టం నీతిమాలిన చర్య.. సీఎం జగన్‭పై చంద్రబాబు ఫైర్

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు... కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు

file photo

Chandrababu backs Pawan Kalyan: కొద్ది రోజులుగా వాలంటీర్ల గురించి మాట్లాడుతు్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద పరువు నష్టం కేసు వేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్య బుద్దిలేనిదని నితిమాలినదని ఆయన అన్నారు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

YV Subbareddy : పబ్లిసిటీ కోసమే పవన్ వాలంటీర్లపై ఆరోపణలు : వైవీ సుబ్బారెడ్డి
‘తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారిపై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు…రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యింది. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి… ఈ అణచివేత ధోరణి మానుకోవాలి.

Uttarakhand : పక్కా ప్లాన్ .. కొత్త ప్రియుడి కోసం పాత ప్రియుడ్ని పాముకాటుతో చంపించిన యువతి

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు… కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు… పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచం. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలి.

Shaik Mastan Vali : మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాని 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు.. బీజేపీ చేసింది శూన్యం

ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి… రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి….మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు